📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ…*

*మహిళలతో బతుకమ్మ ఆడిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15*

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రం లోని రంగ కన్వెన్షన్ హాల్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని అక్కా చెల్లెళ్లు , మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సందడిని మరింత పెంచారు. కార్య క్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాముఖ్యతను వివరిస్తూ , అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబా లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో రేషన్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు పార దర్శకంగా , అర్హులైన లబ్ధి దారులకు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం , ఆర్థిక అభి వృద్ధి , ఆత్మగౌరవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మహిళలకు అండగా నిలవడం , వారి కుటుంబాల ఆర్థిక పరి స్థితులను మెరుగు పరచడం , ప్రభుత్వ పథకాల ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకు రావడం ప్రభుత్వ లక్ష్య మని తెలిపారు. మహిళల అభివృద్ధితోనే కుటుంబాలు , సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబా నికి చేరువ చేయడానికి ప్రజాప్రతినిధులు , అధి కారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండు గను మహిళలతో కలిసి జరుపుకోవడంఆనందంగా ఉందని బీర్ల అయిలయ్య తెలిపారు. ప్రకృతిని పూజిస్తూ , పూలను ఆరా ధిస్తూ , మహిళలు ఐక మత్యంతో జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రంగు రంగుల పూలతో అలం కరించిన బతుకమ్మల చుట్టూ మహిళలతో కలిసి ఆయన బతుకమ్మ ఆడారు. పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ , ప్రతి ఇంటా సంతోషం , సౌభాగ్యం , సిరిసంపదలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. ప్రకృతి మాత ఆశీస్సులతో ఎలినినో ప్రభావం తగ్గి , రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధి గా వర్షాలు కురవాలని బీర్ల ఐలయ్య ఆకాంక్షించారు. రైతులకు సాగునీరు సమృద్ధిగా అందాలని , పంటలు బాగా పండాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. నియోజక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని బతుకమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను ప్రతి బింబించే బతుకమ్మ వేడుకలను నిర్వ హించడం ద్వారా సంక్షేమం , మహిళా సాధికారత , సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్య తను చాటి చెప్పారు. ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.