📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం

తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం.*

రంగారెడ్డి జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం

అక్టోబర్ 27/ప్రజావాణి ప్రతినిధి.

తలకొండపల్లి మండలం.

తలకొండపల్లి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ వి. జానకిరామ్ రెడ్డి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ తలకొండపల్లి జడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న 8,9,10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరును, పోలీస్ స్టేషన్ లో నిర్వహించే విధులు, పౌరులు పొందాల్సిన సేవల గురించి వివరించారు. విద్యార్థులకు డయల్ 112, షీ టీమ్, సైబర్ క్రైమ్, ఆయుధాల పనితీరు, వీహెచ్ఎఫ్ సెట్ వినియోగం గురించి, రిసెప్షన్ వ్యవస్థ, సిసిటిఎన్ఎస్ పనితీరు, మరియు ఫింగర్ ప్రింట్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఇన్స్పెక్టర్ జానకి రాంరెడ్డి మాటాడుతూ విద్యార్థులు జీవితంలో సాధించాల్సిన అంశాల గురించి, చదువు ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె. శేఖర్, ఏఎస్ఐ విష్ణువర్ధన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.