📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరోడ్లపై అడ్డగోలు పార్కింగ్.. ముప్పు ముసరుతున్నా పట్టించుకోని వైనం

రోడ్లపై అడ్డగోలు పార్కింగ్.. ముప్పు ముసరుతున్నా పట్టించుకోని వైనం

📰 Generate e-Paper Clip

రోడ్లపై అడ్డగోలు పార్కింగ్.. ముప్పు ముసరుతున్నా పట్టించుకోని వైనం!
ప్రధాన రహదారులపై వాహనాల నిಲುవుతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు

అద్దంలాంటి రోడ్లను ఆక్రమిస్తున్న ప్రైవేట్ వాహనాలు, దుకాణదారులు

పెరుగుతున్న ప్రమాదాలు.. మొద్దునిద్ర వీడని అధికార యంత్రాంగం

వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 27 (ప్రజావాణి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, రద్దీగా ఉండే వీధుల్లో వాహనాల అడ్డగోలు పార్కింగ్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రోడ్డు నిబంధనలను గాలికొదిలేసి ఇష్టానుసారంగా వాహనాలను రోడ్లపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇదే ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలకు ఈ అస్తవ్యస్త పార్కింగే ప్రధాన కారణమని స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలు.. ప్రాణాలకు
షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సంతోళాలు మరియు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు వాహనాలను సరైన స్థలంలో పార్కింగ్ చేయకుండా, నేరుగా రోడ్డు మీదనే వదిలివెళ్తున్నారు. దీనికి తోడు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసేవారు సామాగ్రిని నిల్వ చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు సరైన స్థలం లేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారుల ఉదాసీనత:
ప్రధాన రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తున్న వారిపై ట్రాఫిక్, పంచాయతీ లేదా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రోడ్లపై అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై జరిమానాలు విధించాలని, రోడ్లను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.