📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణక్రీడలు వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ పట్టుదల నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి ఎమ్మెల్యే జారే

క్రీడలు వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ పట్టుదల నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి ఎమ్మెల్యే జారే

📰 Generate e-Paper Clip

*క్రీడలు వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ పట్టుదల నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి ఎమ్మెల్యే జారే*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని ఏహెచ్ఎస్ కమలాపురం హాస్టల్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-14 నుంచి అండర్-17 విభాగాల బాలబాలికల జోనల్ స్థాయి పాఠశాల క్రీడా పోటీలను గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు, ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పట్టుదల జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు క్రీడా పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్.వి సత్యనారాయణ.ఎంఈవో జి. సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జహీర్, కారం సుధీర్. కుంజా వినోద్ కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.