📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి

డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి

📰 Generate e-Paper Clip

డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి—

జవహర్ నగర్ అక్టోబర్ 21 ( ప్రజావాణి ప్రతినిధి)

డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ-చైర్మన్ షేక్ షావలి డిమాండ్–
–జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషవాయువుల మహమ్మారికి మహ్మద్ సలీం(40) అనే అమాయక ప్రాణం బలి.
–భయం, ఆర్థిక ఇబ్బందుల వలన రాంకీ సంస్థపై పోలీసు కేసుకు అంగీకరించని కుటుంబ సభ్యులు.

కీసర సర్కిల్, జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిగల, గబ్బిలాలపేట, ఈస్ట్ నందమూరి నగర్ కు చెందిన మహ్మద్ సలీం (40 సం.రాలు) అనే వ్యక్తి 2026, అక్టోబర్-20, మంగళవారం తెల్లవారు జామున ఊపిరి ఆడక, ఉక్కిరిబిక్కిరి అయ్యి హఠాన్మరణం చెందారని ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, జేఏసి కన్వీనర్స్ బహుజన రక్షణ సమితి మహ్మద్e జావేద్, వైఎస్సార్ నగర్ శారద బుదవారం రోజు పంపిన పత్రిక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల వరుసగా సంభవిస్తున్న మరణాలపై డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలకు అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గుర్తుచేశారు. అంబేద్కర్ నగర్ చెందిన డి.అరుణ, గబ్బిలాలపేట గాదరి సోమయ్య, వైయస్సార్ నగర్ బొల్లం క్రిష్ణా లాంటివారు శ్వాస సంభందింత సమస్యలతో అర్ధాంతరంగా కన్నుమూశారని ఆరోపించారు. మృతుడు సలీంకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, నాలుగు చక్రాల చెక్క బండిపై ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడని సుమారు రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం గద్వాల జిల్లా, గట్టు మండలం, గొల్లపల్లి గ్రామం (గొర్లకాం) నుండి జవహర్ నగర్ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డాడని గుర్తుచేశారు. గత రెండు, మూడు నెలలుగా రాంకీ డంపింగ్ యార్డు నుండి వెలువడుతున్న తీవ్ర దుర్వాసన, ముఖ్యంగా అర్ధరాత్రి పూట వెలువడే విష వాయువులు, పొగలతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని, భరించలేని దుర్గంధంతో రాత్రంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు వాపోయారని అన్నారు. పొమ్మనలేక పొగ బెట్టిన చందంగా శాశ్వత డంపింగ్ యార్డు ప్రాంతంగా జవహర్ నగర్ ను మార్చే కుట్రలో బాగంగా స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలను వెళ్ళెగొట్టెందుకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ప్రజల నుండి పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ప్రజా ఆరోగ్యం, వరుసగా సంభవిస్తున్న అసహజ మరణాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలో బాగంగా రాంకీ చెత్త డంపింగ్ యార్డును జవహర్ నగర్ ప్రాంతం నుండి శాశ్వతంగా తొలగించే చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. పసలేని అఖిలపక్షంలాంటి వేదికలతో ప్రజలను ఇంకెంత కాలం మోసగించలేరని గుర్తుచేశారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కూడా పీల్చి పిప్పి చేస్తున్న ఈ రాంకీ మహమ్మారి డంపింగ్ యార్డు ఇంకా ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ, కీసర, యాప్రాల్, చెర్లపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్న క్రమంలో
ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే, ఎం.పి. మరియు డిసిసి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎలాంటి మీనవేశాలు లెక్కించకుండా, ప్రజల ప్రాణాలు హరిస్తున్న రాంకీ డంపింగ్ యార్డును బేషరతుగా ఎత్తివేతకు, గ్రేటర్ హైదరాబాద్ నుండి జవహర్ నగర్ కు చెత్త తరలింపును వెంటనే నిలిపివేసేలా ఐక్యంగా స్పందించాలని కోరారు.
మృతుడు మహ్మద్ సలీం కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి, అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాంకీ సంస్థ నుండి వెలువడుతున్న విష వాయులు, దుర్వాసనలపై అకాల మరణానికి గురైన బాదిత సలీం కుటుంబ సభ్యలచేత వైద్య, పోలీసు శాఖల ద్వారా వాస్తవాలు నిగ్గు తేల్చడానికి గాలీ, నీరు, భూమి నాణ్యతపై పరిక్షలు చేయించేలా కేసు నమోదు చేయించి, విచారణ జరిపించాల్సిన అవసరాన్ని జేఏసి గుర్తించిందని, కానీ వారి భయం, ఆర్థిక సమస్యలు, బంధువుల ఆందోళనల నేపథ్యంలో పోస్టుమార్టం, పోలీసు కేసు లాంటి వాటికి అంగీకరించ లేకపోయారని చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్స్ మహ్మద్ జావేద్, శారద పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.