📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ‘అలయ్-బలయ్’ వేడుకలు

ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ‘అలయ్-బలయ్’ వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ‘అలయ్-బలయ్’ వేడుకలు*

*ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా*

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం
నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో ‘అలయ్-బలయ్’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆత్మీయత, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ వేడుకలకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డిలను పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ‘అలయ్-బలయ్’ సంప్రదాయాన్ని కొనసాగించారు.
ఈ వేడుకల్లో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.