📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. అవినీతికి అనుమతిచ్చినట్లే

కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. అవినీతికి అనుమతిచ్చినట్లే

📰 Generate e-Paper Clip

కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. అవినీతికి అనుమతిచ్చినట్లే

మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి
మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ తో కలిసి వైసీపీ నేతల ప్రెస్‌మీట్

అనంతపురం బ్యూరో అక్టోబర్ 21 మన ప్రజా వాణి
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. ప్రజలు అవినీతికి అనుమతిచ్చినట్లేనని వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్‌ను గెలిపించాలని కోరారు. బుధవారం వైఎసఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానంతోపాటు 60 డివిజన్లలో వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మరో రెండు డివిజన్లలో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరినీ ఆశీర్వదించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెట్రేగిపోయాయన్నారు. 2019 నుంచి 2024 వరకు జిల్లా కేంద్రమైన అనంతపురం నగరం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేదని తెలిపారు. ఈ రెండున్నరేళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు అన్నీ సవ్యంగానే జరిగాయని, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వైసీపీ అభ్యర్థులకు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. దాడులు చేస్తామని, కేసులు నమోదు చేయిస్తామని మధ్యవర్తుల ద్వారా కూడా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెస్తే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు. అప్పట్లోనే చంద్రబాబు అధికారంలోకి వస్తే.. చంద్రముఖి నిద్రలేపినట్లేనని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, ఈ విషయం రెండున్నరేళ్లలోనే ప్రజలకు పూర్తిగా అర్థమైందన్నారు. సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టి, ప్రచార ఆర్భాటానికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా.. అనేకచోట్ల దాడులు, దౌర్జన్యాలు చేశారని, ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 19 చోట్ల నామినేషన్ల స్వీకరణకు సమయం ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని తెలిపారు. అనంతపురం అభివృద్ధి చెందాలంటే యువకుడైన రమేష్ గౌడ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కార్పొరేటర్ అభ్యర్థులుగా తమ పార్టీ ఎక్కువ శాతం యువతకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.
ఐక్యమత్యంగా అనంత కార్పొరేషన్‌ను గెలుచుకుంటాం అని తెలిపారు.
మన అనంతపురంను మనం కాపాడుకుందాం..”*
వైసీపీ నగర మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో 2014 నుంచి 2019 వరకు మÖడు ముక్కలాటలా పాలన సాగిందన్నారు. అభివృద్ధికి ప్రజలను దూరం చేశారని దుయ్యబట్టారు. 2019 నుంచి 2014 వరకు ప్రతి గుమ్మం వద్దకు సంక్షేమ పథకాలను తీసుకెళ్లామని తెలిపారు. అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో 50 డివిజన్లలో 1200 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి డివిజన్‌లోనూ మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. వరదలు, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో అనంత వెంకటరామిరెడ్డితోపాటు వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలిచారన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గడిచిన రెండున్నరేళ్లలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తోపుడుబండి వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. నగర ప్రజలకు ప్రశాంతత కరువైందని చెప్పారు. “మన అనంతపురంను మనం కాపాడుకుందాం..” అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు. రెండున్నరేళ్లపాటు జరిగిన అన్యాయాలకు గుణపాఠంగా కూటమి అభ్యర్థికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తాము ప్రజల పక్షంలోనే ఉన్నామని, కార్పొరేషన్ ఎన్నికల్లో తనతోపాటు కార్పొరేటర్ అభ్యర్థులకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. నగరంలో ఉన్న మేధావులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
రమేష్ గౌడ్‌ను గెలిపించండి :* వైసీపీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, మహాలక్ష్మీ శ్రీనివాస్, మహ్మద్ వసీం, నదీం అహ్మద్, వైటీ శివారెడ్డి, కోగటం విజయభాస్కరరెడ్డి, మీసాల రంగన్న, కాగజ్‌ఘర్ రిజ్వాన్ మాట్లాడుతూ.. సౌమ్యుడు, మృదుస్వభావి అయిన రమేష్ గౌడ్‌ను అనంతపురం మేయర్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. తప్పకుండా కార్పొరేషన్‌లో మేజార్టీ స్థానాలతోపాటు కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నాయకులంతా కలిసికట్టుగా ప్రచారం నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. అనంతపురం కార్పొరేషన్‌ను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. కూటమి నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాలకు ఎవరూ భయపడద్దని తెలిపారు. అనంతపురం నగరాన్ని అందరం కలిసికట్టుగా ప్రశాంతంగా ఉంచుకుందామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.