📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణక్లాస్ మెంట్ కుటుంబానికి చేయూత

క్లాస్ మెంట్ కుటుంబానికి చేయూత

📰 Generate e-Paper Clip

క్లాస్ మెంట్ కుటుంబానికి చేయూత..
ప్రజావాణి,ఇనుగుర్తి:క్లాస్ మెంట్ బండారి దివ్య కు పితృవియోగం జరగడంతో చలించిన స్నేహితులు ఆర్థిక సహాయం అందజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
దివ్య తండ్రి బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న సహచర క్లాస్ మెంట్స్ బుధవారం స్నేహితురాలి ఇంటికి చేరుకొని మృతుడు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్నేహితురాలిని,కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.8,000 నగదును అందజేశారు. కష్ట సమయంలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో అయ్యప్ప బైక్ జోన్ ప్రొ.సుంకనపల్లి రాకేష్,గండు రాము,మెట్టు రాకేష్, గడ్డం రాకేష్,కొడారి మురళి,కొత్తూరు పవన్, కేసరి నవీన్, కమటం మహేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.