📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేటలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

జోగిపేటలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*జోగిపేటలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు*

• 26 ఏళ్లుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.. భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 14 జోగిపేట్ : జిల్లా ప్రతినిది

ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలో స్నేహ సిరి యూత్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మహదేవ్ గౌడ్, మహావీర్ గౌడ్, రాజా గౌడ్ వ్యవహరించి భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవను కొనసాగిస్తున్నారు.
దుర్గాదేవి విగ్రహాన్ని అందించిన శ్లోకం శర్వాణి పులుగు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పులుగు నరసింహారావు, పులుగు గోపాల్ రావు, డాక్టర్ వీణ, వాణి, శీలా తదితరులు అమ్మవారి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
గత 26 సంవత్సరాలుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దుర్గామాత ఆశీస్సులతో భక్తులకు అన్నదానం చేయడం పట్ల పట్టణ ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.