📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలక్ష్మీకాంతపూర్‌లో సమగ్ర భూ సర్వేపై గ్రామసభ

లక్ష్మీకాంతపూర్‌లో సమగ్ర భూ సర్వేపై గ్రామసభ

📰 Generate e-Paper Clip

లక్ష్మీకాంతపూర్‌లో సమగ్ర భూ సర్వేపై గ్రామసభ
సమగ్ర భూ సర్వేకు ప్రజలు సహకరించాలి
లక్ష్మీకాంతపూర్‌లో గ్రామసభ నిర్వహణ
దండేపల్లి, అక్టోబర్ 14 (ప్రజావాణి):
దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామ పంచాయతీలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు ఆర్డీఓ, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ చిలుకూరి మహేష్, తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీఓ జే.ఆర్. ప్రసాద్, రెవెన్యూ శాఖ సిబ్బంది హాజరయ్యారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్ సాగర్, జీపీఓ విలాస్, వార్డు సభ్యులు మధు, సంపత్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు సమగ్ర భూ సర్వేకు సంబంధించిన వివరాలను గ్రామ ప్రజలకు వివరించారు. భూ సర్వే ప్రక్రియపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, సర్వేకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. భూముల వివరాల సేకరణ, సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, సమగ్ర భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు గ్రామ ప్రజలు రెవెన్యూ అధికారులకు సహకరించాలని సూచించారు. భూ సర్వేకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో భూ సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.