📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి కష్టాలు

ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి కష్టాలు

📰 Generate e-Paper Clip

ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి కష్టాలు

నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డెక్కిన కాలనీవాసులు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 13

కనిగిరి: కనిగిరి మండలం ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీరు, రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కాలనీవాసులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.

ప్రస్తుత ప్రభుత్వం, సంబంధిత అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి నీటి సమస్య ఎదురైనప్పుడు అప్పటి పాలకులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వాపోయారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.