📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచలో ఒంగోల్ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ

చలో ఒంగోల్ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

చలో ఒంగోల్ కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 11

షేక్ సైదా ఆధ్వర్యంలో ఎస్పీని కలిసిన అఖిలపక్ష ప్రతినిధి బృందం

ఒంగోలు (అక్టోబర్ 11 ఈనెల 12వ తేదీ అనగా రేపు ఒంగోలులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సారధ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలు ఆధ్వర్యంలో తౌశిక్ మౌలాబీల మరణాన్ని కారకులైన శ్రీ చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కోరుతూ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆంక్షలుతో కూడిన మౌఖిక అనుమతిని ఇచ్చారు

నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి పరిస్థితుల్లో మహా ధర్నా జరగడానికి వీలు లేదని 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా ధిక్కరిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించని ఎస్పీ నేడు అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సారథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాసంఘాల నేతలు కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించి ఈ ధర్నాకు అనుమతించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ 500 మందితో ధర్నా నిర్వహించడానికి నేను అనుమతిస్తున్నానని అంతకంటే మించి జనాలని తరలించవద్దని ఆయన కోరారు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడవద్దని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, సిపిఐ ఎంఎల్ నాయకులు చిట్టి పాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పసుమర్తి సుధాకర్, లోక్సత్తా నాయకులు ఎస్ చంద్రశేఖర్,
ఇలా ముస్లిం మైనార్టీ సంఘాల అధ్యక్షులు షేక్ రఫీ, యువజన నాయకుడు కృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు (అక్టోబర్ 11) ఈనెల 12వ తేదీ అనగా రేపు ఒంగోలులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సారధ్యంలో అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలు ఆధ్వర్యంలో తౌశిక్ మౌలాబీల మరణాన్ని కారకులైన శ్రీ చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని కోరుతూ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆంక్షలుతో కూడిన మౌఖిక అనుమతిని ఇచ్చారు

నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి పరిస్థితుల్లో మహా ధర్నా జరగడానికి వీలు లేదని 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా ధిక్కరిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించని ఎస్పీ నేడు అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సారథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజాసంఘాల నేతలు కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించి ఈ ధర్నాకు అనుమతించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ 500 మందితో ధర్నా నిర్వహించడానికి నేను అనుమతిస్తున్నానని అంతకంటే మించి జనాలని తరలించవద్దని ఆయన కోరారు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడవద్దని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, సిపిఐ ఎంఎల్ నాయకులు చిట్టి పాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ, సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పసుమర్తి సుధాకర్, లోక్సత్తా నాయకులు ఎస్ చంద్రశేఖర్,
ఇలా ముస్లిం మైనార్టీ సంఘాల అధ్యక్షులు షేక్ రఫీ, యువజన నాయకుడు కృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.