📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriబహుజన రాజ్య సాధనే కాన్షీరామ్‌కు నిజమైన నివాళి ....అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: డోంగిరి...

బహుజన రాజ్య సాధనే కాన్షీరామ్‌కు నిజమైన నివాళి ….అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: డోంగిరి రాజబాబు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 11(ప్రజావాణి):బహుజన రాజ్య సాధన కోసం మాన్యవర్ కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థి నాయకుడు డోంగిరి రాజబాబు పిలుపునిచ్చారు.

ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 287వ వారం నిత్య పూలమాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి, కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రలను యువత అధ్యయనం చేసి, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. బాంసెఫ్, డీఎస్‌-4, బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా బహుజన సమాజాన్ని సంఘటితం చేయడంలో కాన్షీరామ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, రాజకీయ చైతన్యం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేకల దాస్, బండారి రాందాస్, కె. సత్యం, కె. నర్సింగరావు, మీసాల రాజేశ్, బాలనగరం గణేశ్ గౌడ్, డి. శివకృష్ణ, సి. నిఖిల్, ఈ. విష్ణువర్ధన్, బాలకిషన్, ప్రశాంత్ కుమార్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.