📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోత్కపల్లికి లోవోల్టేజ్ కష్టాల నుంచి విముక్తి

పోత్కపల్లికి లోవోల్టేజ్ కష్టాల నుంచి విముక్తి

📰 Generate e-Paper Clip

పోత్కపల్లికి లోవోల్టేజ్ కష్టాల నుంచి విముక్తి

సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవతో అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ, ఉప సర్పంచ్ రజనీకాంత్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈడీ తౌటం రవీందర్‌ను కలిసి గ్రామంలో నెలకొన్న లోవోల్టేజ్ సమస్యను వివరించి, అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం గ్రామంలో అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ లైన్‌మెన్ నవీన్, వార్డు సభ్యులు పిట్టల లక్ష్మణ్, పిట్టల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.