📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీళ్ల ట్యాంకు వద్ద నరకం

చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీళ్ల ట్యాంకు వద్ద నరకం

📰 Generate e-Paper Clip

చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీళ్ల ట్యాంకు వద్ద నరకం – దుర్గంధం, మురుగు నిల్వ తో విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు!

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తాగునీటి పక్కనే మురుగు నీరు – పిల్లలకు మలేరియా, టైఫాయిడ్ ముప్పు?

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. విద్యార్థులు తాగునీరు తాగే వాటర్ ట్యాంకు పరిసరాల్లో మురుగు నీరు నిలిచి, తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటర్ ట్యాంకు చుట్టూ పారిశుధ్యం లేకపోవడం, మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి ట్యాంకు పక్కనే ఇలా మురుగు నిల్వ ఉండటం వల్ల ఆ నీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉందని, విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం, హెచ్ ఎమ్, ఎమ్ ఈ ఒ వెంటనే స్పందించి వాటర్ ట్యాంకు పరిసరాల్లో పేరుకుపోయిన మురుగు నీటిని తొలగించాలి. బ్లీచింగ్, ఫాగింగ్ చేయించాలి. ట్యాంకును శుభ్రం చేసి, చుట్టూ పారిశుధ్యం మెరుగుపరచాలి. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన తాగునీటి వసతి కల్పించాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమే అవుతుందని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.