దళిత జర్నలిస్టుల 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 03 జోగిపేట: సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
దళిత జర్నలిస్ట్ ఫోరం ( డి జె ఎఫ్ ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని అందోల్ నియోజకవర్గంలోని దళిత జర్నలిస్టులు, తొమ్మిది మండలాలకు చెందిన దళిత జర్నలిస్టులను నిర్వాహకులు కోరారు. అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

