📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaపేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు

పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు

📰 Generate e-Paper Clip

పేదింటి విద్యార్థినికి ఎంబిబిఎస్ సీటు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

స్థానిక చండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చెందిన విద్యార్థిని గొల్లగూడం గ్రామానికి చెందినా నారముల గంగోత్రి తండ్రి వెంకటయ్య హైదరాబాదులోని హయత్ నగర్ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలలో బైపీసీ నుండి నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం తో పాటు నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందడం జరిగింది. దానికి గాను శ్రీ వశిష్ట కళాశాల చైర్మన్ లింగమనేని ప్రమీల విద్యార్థిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం వంశీ , డీన్ శ్రీనివాస్ గౌడ్ , ఏజీఎం విజయ్ ప్రకాశ్ చండూరు పట్టణానికి విచ్చేసి కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గంగోత్రి కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేఖర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైన గంగోత్రి మెడికల్ సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని మా పాఠశాలకు చెందిన విద్యార్థినిని సీటు పొందే విధంగా కృషిచేసిన శ్రీ వశిష్ట కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థిని గంగోత్రి మాట్లాడుతూ కళాశాలలో మంచి వాతావరణంతో కూడిన పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రాం ఉండటం వల్ల ఈ విజయం సాధ్యం అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మహబూబు చండూరు మార్కెటింగ్ ఇంచార్జీ పేర్ల గణేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.