📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపారిశుద్ధ్య నిర్వహణలో డిజిటల్‌ విప్లవం

పారిశుద్ధ్య నిర్వహణలో డిజిటల్‌ విప్లవం

📰 Generate e-Paper Clip

*పారిశుద్ధ్య నిర్వహణలో డిజిటల్‌ విప్లవం.. ఎఫ్‌ఆర్‌ఎస్‌, క్యూఆర్‌ కోడ్‌తో పటిష్ట పర్యవేక్షణ!*

*కార్మికుల హాజరు నుంచి వాహనాల పనితీరు వరకు సాంకేతిక నిఘా – మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నల్గొండ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదుకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌), వాహనాల పనితీరు పర్యవేక్షణకు క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా నమోదు చేయడం వల్ల విధులకు హాజరయ్యే సిబ్బంది వివరాల్లో పారదర్శకత పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణను మెరుగ్గా పర్యవేక్షించేందుకు వీలవుతుందని మేయర్‌ తెలిపారు. అదేవిధంగా, పారిశుద్ధ్య వాహనాల నిర్వహణకు ప్రవేశపెట్టిన క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా వాహనాల రాకపోకలు, చెత్త సేకరణ, డంపింగ్‌ వివరాలు, డీజిల్‌ వినియోగం, వాహనాల పనితీరు, మరమ్మతుల అవసరాలను పర్యవేక్షించవచ్చని వివరించారు. ఈ విధానాలు సమర్థవంతమైన పర్యవేక్షణకు దోహదపడటంతో పాటు, సమయం & ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మేయర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ, కమిషనర్‌ బి. వంశీకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.m

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.