📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఘనంగా నరసింహుల పేట లో ఎంగిల పూల బతుకమ్మ పండుగ వేడుకలు

ఘనంగా నరసింహుల పేట లో ఎంగిల పూల బతుకమ్మ పండుగ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

-సందడి చేసిన ఆడపడుచులు

నరసింహులపేట. అక్టోబర్ 10(ప్రజావాణి)

మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మొదటి రోజైన “ఎంగిలిపూల బతుకమ్మ” వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుంచే మహిళలు,యువతులు తంగేడు,గునుగు,బంతి,చామంతి తదితర రకరకాల పూలను సేకరించి,అందంగా బతుకమ్మలను తీర్చిదిద్దారు.సాయంత్రం వేళ బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా గంగాయి కుంట వద్దకు తీసుకెళ్లారు.గౌరమ్మను మనసారా కొలుస్తూ..”గౌరమ్మ గౌరమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో” అంటూ మహిళలు,యువతులు బతుకమ్మ చుట్టూ చప్పట్లు కొడుతూ భక్తితో పాడిన పాటలు,ఆడిన ఆటలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఆటపాటల కోలాహలంతో మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆడపడుచులకు గ్రామపంచాయతీ సిబ్బంది మంచినీళ్లు అందించారు. పోలీసు సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతను ఏర్పరిచారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.