ఘనంగా నరసింహుల పేట లో ఎంగిల పూల బతుకమ్మ పండుగ వేడుకలు
-సందడి చేసిన ఆడపడుచులు నరసింహులపేట. అక్టోబర్ 10(ప్రజావాణి) మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ మొదటి రోజైన "ఎంగిలిపూల బతుకమ్మ" వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.ఉదయం నుంచే మహిళలు,యువతులు తంగేడు,గునుగు,బంతి,చామంతి తదితర రకరకాల పూలను సేకరించి,అందంగా బతుకమ్మలను తీర్చిదిద్దారు.సాయంత్రం వేళ బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా గంగాయి కుంట వద్దకు తీసుకెళ్లారు.గౌరమ్మను మనసారా కొలుస్తూ.."గౌరమ్మ గౌరమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో" అంటూ...