📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంద్రసేనారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

విద్యావేత్త మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర సంతాపం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): జిల్లా లోని
దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎర్రంరెడ్డి ఇంద్రసేనారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆదివారం కడవెండి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంద్రసేనారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ – ఇంద్రసేనారెడ్డి ఉపాధ్యాయుడిగా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన మృతి విద్యా రంగానికి, గ్రామానికి తీరని లోటని అన్నారు.

వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇంద్రసేనారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెరా అనిల్ కుమార్, మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.