📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ కిషన్

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ కిషన్

📰 Generate e-Paper Clip

తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ కిషన్
గిరిజన హక్కుల సాధనకు కృషి చేస్తా
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి ,అక్టోబర్ 13, ప్రజావాణి:
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాలోత్ కిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా, కురవి మండల పరిధిలోని బలపాల శివారు తండాకు చెందిన కిషన్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.
గత పదేళ్లుగా గిరిజనుల హక్కుల సాధన కోసం మాలోత్ కిషన్ నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం, డీవైఎఫ్‌ఐ, తెలంగాణ గిరిజన సంఘాల్లో పనిచేస్తూ గిరిజనులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మాలోత్ కిషన్ మాట్లాడుతూ.. రాష్ట్ర నాలుగో మహాసభలు ఉత్తేజభరిత వాతావరణంలో జరిగాయని, తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
గిరిజన సమస్యలపై ఉద్యమాలు
మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గిరిజన తెగలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో విస్తృత స్థాయిలో పోరాటాలు నిర్వహిస్తామని కిషన్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అవసరమైన అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.
గిరిజన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గిరిజన సంఘాన్ని సంప్రదించాలని, సంఘం ఆధ్వర్యంలో చేపట్టే పోరాటాల్లో గిరిజనులు, గిరిజన అభిమానులు భాగస్వాములై పూర్తి మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ గిరిజన సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాలోత్ కిషన్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.