📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్కేసర్ 6వ డివిజన్‌లో దళితులకు న్యాయం చేయాలి - తోక మల్లేష్

ఘట్కేసర్ 6వ డివిజన్‌లో దళితులకు న్యాయం చేయాలి – తోక మల్లేష్

📰 Generate e-Paper Clip

 

ఘట్కేసర్, అక్టోబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ 6వ డివిజన్‌లోని మాల, మాదిగ వర్గాల సమస్యలను పరిష్కరించి, దళితులకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పించాలని కోరుతూ దళిత సోదరులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రం సమర్పించారు.

డివిజన్ పరిధిలో దళితులకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని, దళిత నాయకులను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

మాల, మాదిగ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళిత నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఘట్కేసర్ 6వ డివిజన్‌లో దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్‌లో తమ రాజకీయ నిర్ణయాన్ని తామే తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.