ఘట్కేసర్ 6వ డివిజన్‌లో దళితులకు న్యాయం చేయాలి – తోక మల్లేష్

  ఘట్కేసర్, అక్టోబర్ 2 (ప్రజావాణి): ఘట్కేసర్ 6వ డివిజన్‌లోని మాల, మాదిగ వర్గాల సమస్యలను పరిష్కరించి, దళితులకు సముచిత గౌరవం, గుర్తింపు కల్పించాలని కోరుతూ దళిత సోదరులు ప్రజాప్రతినిధులకు వినతి పత్రం సమర్పించారు. డివిజన్ పరిధిలో దళితులకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని, దళిత నాయకులను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. మాల, మాదిగ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...