నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం జరిగింది. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. విద్యతో పాటు సామాజిక స్పృహ అవసరమని. శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిపి 42 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య విజయ్‌బాబు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.మారం వెంకట రమణారెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా.షరీఫ్, డా.ఆనంద్, డా.కిరణ్, రమేష్ నాయక్ ఉన్నారు.
ప్లేస్మెంట్ డ్రైవ్‌లో 16 మందికి ఉద్యోగాలు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఎంపికైన 16 మంది అభ్యర్థులకు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామక పత్రాలు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ జి.మారేశ్వరరావు, డా.జయంతి, డీన్ ఆచార్య రేఖ ఉంది.
ఎంజీయూలో రక్తదాన శిబిరం
ఏఐతో రసాయన శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రసాయన శాస్త్ర పరిశోధనల స్వరూపాన్ని మారుస్తోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పార్థసారథి అన్నారు. ఎం.ఎన్.ఎస్. బిజినెస్ చైర్ సమర్పించిన మన్నె అచ్చిరెడ్డి స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ ఏఐఐ ద్వారా మందుల గుర్తింపు, ప్రభావశీలత అంచనా, సూచన రూపకల్పన వంటి ప్రక్రియలను వేగవంతం చేయనున్నారు. పర్యావరణహిత రసాయన ప్రక్రియలు, తక్కువ వ్యర్థాలు, తక్కువ శక్తి వినియోగానికి ఏఐ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఫార్మా రంగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ సూచించారు. కార్యక్రమంలో ఆచార్య వసంత, ఆచార్య అన్నపూర్ణ, ఆచార్య రఘురామారావు, డా. ప్రశాంతి ఉన్నారు.

