📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఖమ్మం జిల్లా నే లకొండపల్లి లో అక్రమ మట్టి దందా వివరణ కోరడంతో.. స్పందించిన తహసిల్దార్...

ఖమ్మం జిల్లా నే లకొండపల్లి లో అక్రమ మట్టి దందా

వివరణ కోరడంతో.. స్పందించిన తహసిల్దార్ రాంప్రసాద్

📰 Generate e-Paper Clip

ఖమ్మం జిల్లా నే లకొండపల్లి లో అక్రమ మట్టి దందా

వివరణ కోరడంతో.. స్పందించిన తహసిల్దార్ రాంప్రసాద్

అదుపులోకి తీసుకున్న వాహనాలు…!


అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

తహసిల్దార్ రాంప్రసాద్ వివరణ

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నే లకొండపల్లి మండల కేంద్రానికి  కూత వేటు దూరంలో జరుగుతున్న అక్రమ మట్టి దందాపై నే లకొండపల్లి తహసిల్దార్ పి రాంప్రసాద్ కఠిన చర్యలు తీసుకున్నారని సమాచారం. గతంలో అనుమతులు తీసుకున్న కొందరు గత కొంతకాలంగా అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు దృష్టికి వచ్చిన నేపథ్యంలో అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు మండల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొంతకాలంగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే తేడా లేకుండా సుమారు మూడు టిప్పర్లతో గుట్టలో గుట్టు గా నేలకొండపల్లి ప్రాంతంతోపాటు కోదాడ పరిసర గ్రామాలకు అట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు అత్యంత సమాచారం. ఆ మేరకు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ సేకరించిన ఆధారాలతో వివరణ కోరగా స్పందించిన తాసిల్దార్ రాంప్రసాద్ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆ ప్రాంతానికి చేరిన జిపిఓ స్థానిక పోలీసులు టిప్పర్లను స్వాధీనం చేసుకో ని మిషన్లను ఆ  ప్రదేశంలో ఉంచడం  పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా విధులు నిర్వహించిన ఓ రెవెన్యూ శాఖ ఇన్స్పెక్టర్ అడ్డగోలుగా వ్యవహరించినట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.. మళ్లీ కొంతమంది అండ దండలతో మట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ ఆర్డీవో మైనింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి అక్రమ మట్టి దందాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేలకొండపల్లి మండల ప్రజలతోపాటు పాలేరు నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.