రైతులకు అండగా కౌడి జగదీష్.గిట్టుబాటు ధర కోసం ప్రత్యేక చొరవ !
20 రోజుల్లో 600 లారీల ధాన్యం కొనుగోళ్లు.రైతుల పక్షాన నిలుస్తున్న జగదీష్ !
దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయాలు.రైతులకు భరోసాగా జగదీష్ !
ధాన్యం ధర కోసం ఇతర రాష్ట్రాల వ్యాపారులతో అనుసంధానం.రైతుల మన్ననలు పొందుతున్న జగదీష్ !
చిన్న రైతులకూ అండగా ధాన్యం కొనుగోళ్లలో కౌడి జగదీష్ చొరవ !
కోటగిరి/ప్రజావాణి:-వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా రైతులకు అండగా నిలుస్తూ పోరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల వ్యాపారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్న ఎత్తొండ గ్రామానికి చెందిన ప్రైవేట్ ధాన్యం వ్యాపారి కౌడి జగదీష్ స్థానికంగా రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు.నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన జగదీష్ చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం విక్రయాలకు సహకరిస్తున్నారని.ఆంధ్రప్రదేశ్,కర్ణాటక తదితర ప్రాంతాల వ్యాపారులతో సంప్రదింపులు జరిపి మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ధరలు లభించేలా రైతులకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.ధాన్యం రకాన్ని బట్టి ధరలపై చర్చించి,రైతులకు అనుకూలమైన ధరకు కొనుగోళ్లు జరిగేలా చూస్తున్నానని తెలిపారు.నగదు రైతు ఖాతాలో జమ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే ధాన్యం రవాణా చేపడుతున్నట్లు వివరించారు.
రైతు శ్రేయోభిలాషి కౌడి జగదీష్ మాట్లాడుతూ.

దళారుల ప్రమేయం లేకుండా స్థానిక రైతులకు మెరుగైన ధర లభించేలా కొనుగోళ్లకు చొరవ తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.గత 20 రోజుల వ్యవధిలో మిర్యాలగూడ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన వ్యాపారులతో సమన్వయం చేసి సుమారు 600 లారీల ధాన్యం కొనుగోళ్లకు సహకరించినట్లు ఆయన వెల్లడించారు.ప్రస్తుతం కూడా కొనుగోలులో కొనసాగుతున్నాయని అన్నారు.
స్థానికంగా కొందరివ్యాపారుల తీరుపై ఆయన ఆరోపణలు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొందరు స్థానిక వ్యాపారులు రైతులకు తక్కువ ధరలు ప్రతిపాదిస్తూ మెరుగైన ధరకు కొనుగోళ్లు జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని జగదీష్ ఆరోపించారు. హుంస గ్రామంలో ఓ రైతు వద్ద ధాన్యం ధర నిర్ణయించే విషయంలో స్థానిక వ్యాపారి తనను దుర్భాషలాడారని పేర్కొన్నారు.మార్కెట్లో ధాన్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని ప్రయత్నించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇలాంటి వ్యక్తులపై ఏ విధంగా రైతుల సహకారంతో ప్రతిఘటించాలో రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలో తనకు తెలుసని వెల్లడించారు.
కౌడి జగదీష్ రైతులకు అండగా నిలుస్తున్నారు – రైతు సాయిలు.

దసరాకు ముందు బయటి ప్రాంతాల వ్యాపారులు ధాన్యానికి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారని రైతు సాయిలు తెలిపారు.అయితే దసరా తర్వాత ధరలు తగ్గడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో కౌడి జగదీష్ రైతులకు మెరుగైన ధర లభించేలా వ్యాపారులతో మాట్లాడుతున్నారని.తమకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
కౌడి జగదీష్ మా ధాన్యానికి రూ.3,450 ధర ఇప్పించారు – రైతు అగ్గు హనుమంతు.

మరో గ్రామానికి చెందిన ఓ వ్యాపారి తన కోనారం రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.3,200 ధర నిర్ణయించి,కోతల అనంతరం కొనుగోలుకు రాలేదని తెలిపారు.దీంతో కౌడి జగదీష్ మిర్యాలగూడ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక వ్యాపారులతో మాట్లాడి క్వింటాల్‌కు రూ.3,450 ధర లభించేలా సహకరించారని చెప్పారు.నగదు తన బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత ధాన్యం కొనుగోలు జరిగిందని వివరించారు.తనకు మెరుగైన ధర లభించేలా సహకరించిన జగదీష్‌కు ఆ రైతు కృతజ్ఞతలు తెలిపారు.
క్వింటాల్‌కు రూ.200 వరకు అదనపు ధర కల్పిస్తున్న కౌడి జగదీష్ – పొలిటీషియన్ రాజేందర్.

ఎత్తొండ సొసైటీ పరిధిలోని గ్రామాల్లో కొందరు బయటి వ్యాపారులు ధాన్యం ధర నిర్ణయించి వెళ్లిపోతున్నారని. తర్వాత కొనుగోలుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రముఖ రాజకీయవేత్త ఎత్తొండ రాజేందర్ తెలిపారు.కౌడి జగదీష్ ఇతర రాష్ట్రాల వ్యాపారులతో సంప్రదింపులు జరిపి కొన్ని సందర్భాల్లో బయటి వ్యాపారులు ఇచ్చే ధర కంటే క్వింటాల్‌కు సుమారు రూ.200 వరకు అదనంగా లభించేలా ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కూడా పర్యవేక్షించాలని ఆయన కోరారు.
చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలి – రైతు లక్ష్మణ్.

పెద్ద రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లకు వ్యాపారులు ప్రాధాన్యం ఇస్తున్నారని.చిన్న రైతుల వద్దకు వచ్చేసరికి ధరలు తగ్గిస్తున్నారని రైతు ఎర్రోళ్ల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.పెద్ద రైతుల తోపాటు చిన్న రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.

