📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.1.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.1.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.1.18 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఆరు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

కూకట్‌పల్లి, అక్టోబర్ 27 (ప్రజావాణి)

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. డివిజన్ పరిధిలోని ఆరు కాలనీల్లో మొత్తం రూ.1 కోటి 18 లక్షల 80 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం, అక్టోబర్ 28న శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ, తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
కాలనీల వారీగా అభివృద్ధి పనుల వివరాలు
తులసి నగర్ కాలనీ: రూ.12 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
భూదేవి హిల్స్ కాలనీ: రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
గోవింద్ హోటల్ చౌరస్తా: రూ.38.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
ఛత్రపతి శివాజీ నగర్ కాలనీ: రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
మహంకాళి నగర్ కాలనీ: రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
ఇందిరా నగర్ కాలనీ: రూ.23 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. కాలనీల ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తగ్గడంతో పాటు స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడనున్నాయి.
ఈ శంకుస్థాపన కార్యక్రమానికి డివిజన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, పాత్రికేయులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.