క్లాస్ మెంట్ కుటుంబానికి చేయూత
క్లాస్ మెంట్ కుటుంబానికి చేయూత.. ప్రజావాణి,ఇనుగుర్తి:క్లాస్ మెంట్ బండారి దివ్య కు పితృవియోగం జరగడంతో చలించిన స్నేహితులు ఆర్థిక సహాయం అందజేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దివ్య తండ్రి బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న సహచర క్లాస్ మెంట్స్ బుధవారం స్నేహితురాలి ఇంటికి చేరుకొని మృతుడు రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్నేహితురాలిని,కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.8,000 నగదును అందజేశారు. కష్ట సమయంలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో...