📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొట్రలో లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి

కొట్రలో లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

*-ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు సర్పంచ్ శారద చెన్నయ్య వినతి*

*నాగర్ కర్నూల్ జిల్లా…*

*కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: (అక్టోబర్ 05 ప్రజావాణి)*

వెల్దండ: మండలంలోని కొట్ర గ్రామంలో నెలకొన్న లోవోల్టేజీ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య సోమవారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న లోవోల్టేజీ సమస్య కారణంగా సుమారు 100 గృహాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫ్యాన్లు సరిగా తిరగక, లైట్లు వెలగక, ముఖ్యంగా రాత్రి వేళ దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.అలాగే గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంభాలు తక్కువ ఎత్తులో ఉండటంతో పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి, లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.కొట్ర గ్రామం చీకటిలో మగ్గకుండా విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ శారద చెన్నయ్య అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.