📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనీటి కుంట తో రైతులకు బహుళ ప్రయోజనాలు..

నీటి కుంట తో రైతులకు బహుళ ప్రయోజనాలు..

📰 Generate e-Paper Clip

నీటి కుంట తో రైతులకు బహుళ ప్రయోజనాలు..
అదనపు కలెక్టర్ పురుషోత్తం
ప్రజావాణి,నెల్లికుదురు: వ్యవసాయ క్షేత్రాలలో ఏర్పాటు చేసుకునే నీటికుంట(ఫామ్ పాండ్)లతో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)జెడ్పి సీఈవో పురుషోత్తం అన్నారు. మండలంలోని శ్రీరామగిరిలో రైతులకు చెందిన నీటి కుంట ను మంగళవారం ఎంపీడీవో సింగారపు కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్ రైతుతో పాటు విబిజి రాంజీ కూలీలు, సిబ్బందితో నీటి కుంట నిర్మాణం ప్రాముఖ్యత పై ఆరా తీశారు. నీటి కుంటలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, వేసవిలో సైతం సాగు చేసుకోవచ్చని, పశువులకు నీటి కొరత తీరుతుందని, ఉద్యాన వన పంటలకు,ఎల్ నినో సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి మాదరి ప్రశాంత్, ఉపసర్పంచి సుమన్ బి బి జి రాంజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.