📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకేబీహెచ్ ప్రెస్ కాలనీలో నీటి సమస్య

కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నీటి సమస్య

📰 Generate e-Paper Clip

*కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నీటి సమస్య.. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు!*

**కొత్త బోరు వేయించాలని సర్పంచ్‌, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి కాలనీవాసుల విజ్ఞప్తి*
*మా కాలనీలో బోర్ వెయ్యనీడల గ్రామపంచాయతీ. ఎంపీడీవో ఆఫీసుకి ధర్నా చేస్తాం*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 16 (ప్రజావాణి): మంచాల గ్రామంలోని కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన గడ్డం పాపయ్య హయాంలో కాలనీలో బోరు వేయించారని, అయితే ఆ బోరులో నీరు రాకపోవడంతో దానిని మూసివేసినట్లు స్థానికులు తెలిపారు. బోరు ఉన్న ప్రదేశంలో చిన్నపిల్లలు గల్లీలో తిరుగుతున్నందున ప్రమాదాలు జరగకుండా ఓ వ్యక్తి దానిపై కాంక్రీటు సిమెంటు వేయించినట్లు పేర్కొన్నారు.

గడ్డం పాపయ్య తో ముగ్గురు సర్పంచులు మారినా తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని ప్రస్తుత సర్పంచ్‌, సంబంధిత వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు చెబుతున్నారు.

కాలనీలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు నిత్యావసరాలకు నీటిని సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే వేసవిలో నీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటినుంచే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వేసవి ప్రారంభమైన తర్వాత నీటి సమస్య తీవ్రరూపం దాల్చితే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యపై అధికారులు తక్షణమే స్పందించాలి

ప్రజలకు కనీస అవసరమైన తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీకి లేదా అని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.