కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పట్టాభిరామ్ ఇంటింటి ప్రచారం
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ:విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటీచేసే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగరంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంచి, జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతోపాటు కార్పోరేటర్లుగా పోటీచేసే కూటమి అభ్యర్థులను గెలిపించమని స్థానిక ప్రజలను కోరారు. వీధుల్లో కనిపించిన వారందరితోపాటు పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా పలకరించి, ప్రచార కరపత్రాలు అందజేసి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయమని అభ్యర్థించారు. 30, 43, 44, 45 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కె.నాగుల్ మీరాతోపాటు కూటమి తరఫున కార్పోరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థుల ఫొటోలు, ఎన్నికల గుర్తుల ఫ్లకార్డులు, పార్టీల జెండాలు పట్టుకుని నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థులను గెలిపించమని నినాదాలు చేసుకుంటూ విస్తృతంగా ప్రచారం చేశారు.
జారీ చేసినవారు: పీఆర్ఓ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కార్యాలయం, అమరావతి.


