*ఎన్నికల అక్రమాలపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నిఘా*.. *ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకున్న పోలీసులు*!
*బ్రాడీపేటలో తనిఖీలు.. ముగ్గురు వ్యక్తులు అదుపులోకి, రూ.64 వేల నగదు, ఓటర్ల జాబితా స్వాధీనం*
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలపై పట్టాభిపురం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పోలీసు సిబ్బందితో ఎన్నికల అక్రమాల నియంత్రణపై దృష్టి సారించారు.
బ్రాడీపేట 1/20 ప్రాంతంలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు చర్యలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 41వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి సుజాత తరఫున నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలపై మోతుకూరి వెంకటరత్నం, మాదాసు భాగ్యరావు, దొప్పలగూడి నరసింహారావు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.64 వేల నగదుతో పాటు ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ అబ్రహం ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

