కులకచర్ల మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సంతోష ఎన్నిక.
పరిగి/ కులకచర్ల: ప్రజావాణి ,అక్టోబర్ 24:
కులకచర్ల మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యుల (ఈసీ మెంబర్స్) సమక్షంలో మండల మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలి ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో సంతోష మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలపడంతో ఆమెను అధ్యక్షురాలిగా అధికారికంగా ప్రకటించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు సంతోషను పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, కామన్ పల్లి సర్పంచ్ వెంకటయ్య, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య, వీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, గోరిగడ్డ తాండ సర్పంచ్ లాలూ నాయక్, సెర్ప్ ఏపీఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు సిబ్బంది, మండల సమాఖ్య ఈసీ సభ్యులు పాల్గొన్నారు.

