కులకచర్ల మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సంతోష ఎన్నిక
కులకచర్ల మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సంతోష ఎన్నిక. పరిగి/ కులకచర్ల: ప్రజావాణి ,అక్టోబర్ 24: కులకచర్ల మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యుల (ఈసీ మెంబర్స్) సమక్షంలో మండల మహిళా సమాఖ్య నూతన అధ్యక్షురాలి ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో సంతోష మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. మెజారిటీ సభ్యులు ఆమెకు మద్దతు తెలపడంతో ఆమెను అధ్యక్షురాలిగా అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు సంతోషను పలువురు...