📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఏడవ నిజాం నిర్మించిన గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు 37 కోట్ల నిధులు తీసుకువచ్చిన...

ఏడవ నిజాం నిర్మించిన గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు 37 కోట్ల నిధులు తీసుకువచ్చిన జగ్గారెడ్డి, నిర్మల

📰 Generate e-Paper Clip

ఏడవ నిజాం నిర్మించిన గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు 37 కోట్ల నిధులు తీసుకువచ్చిన జగ్గారెడ్డి, నిర్మల

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (ప్రతినిధి అక్టోబర్:28)

నవంబర్ నెలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, వివేక్ ల చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన 2028 జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి తో ప్రారంభం
నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ లకు కృతజ్ఞతలు
పనులు పూర్తయితే 11 గ్రామాల్లోని 3,300 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం
రైతుల అవసరాలే లక్ష్యంగా త్వరితగతిన పనులు చేపట్టాలి గంగ కత్వ కాలువను పరిశీలించి డైవ్ చేసి ఈత కొట్టిన జగ్గారెడ్డి
గంగకత్వ ప్రాజెక్టు, కాలువ ఆధునీకరణకు రూ.37 కోట్లు మంజూరయన నేపథ్యం లో ‌ జగ్గారెడ్డి గంగ కత్వ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని గంగకత్వ ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, సాగునీటి శాఖ అధికారులు, ఆయకట్టు గ్రామాల రైతులు, స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గంగకత్వ కాలువ పరిధిలోని 11 గ్రామాల్లో 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. సదాశివపేట మండలంలో సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువకు 28 చెరువులు అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. కాలువను ఆధునీకరించి, చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఆధునీకరణ నిధుల కోసం రెండేళ్ల క్రితం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరానని, అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించానని తెలిపారు. రూ.37 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా రైతుల ప్రయోజనాల కోసం నిధులు తీసుకువచ్చానన్నారు. ఏడో నిజాం కాలంలో నిర్మించిన కాలువను తిరిగి ఆధునీకరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని అధికారులకు సూచించారు
లీకేజీల నివారణకు చర్యలు
కాలువ లైనింగ్‌, దెబ్బతిన్న భాగాల మరమ్మతులు, పక్కలకు సీసీ లైనింగ్‌, తూముల పునరుద్ధరణ, వంతెనల వెడల్పు పెంపు తదితర పనులపై సమీక్షించారు. కాలువ పొడవునా తనిఖీలకు ఉపయోగపడే దారిని పునరుద్ధరించాలని సూచించారు. కాలువ నీరు చెరువులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వర్షాకాలంలో కాలువలు తెగిపోతున్నాయని చందాపూర్‌ గ్రామస్థులు తెలిపారు. మిలిగిరిపేట పరిధిలో వాగుల్లో పూడిక తొలగించాలని కోరారు. కాలువలు సరిగా లేక నీరు గ్రామంలోకి వస్తోందని పొట్పల్లి వాసులు వివరించారు. ప్రాజెక్టు చివరన ఉన్న తమ గ్రామానికి నీరందడం లేదని యెన్కేపల్లి రైతులు తెలిపారు. ప్రధాన కాలువ తూము వద్ద లీకేజీలతో నీరు వృథా అవుతోందని చెప్పారు. ఆత్మకూరు పరిధిలో లీకేజీలను అరికట్టి చెరువులకు నీరు మళ్లించాలని, అంకెన్‌పల్లిలో కాలువ ఆకృతి సవరణ, గట్ల బలోపేతం పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. సమస్యలను పరిశీలించి అవసరమైన పనులకు అంచనాలు రూపొందించాలని జగ్గారెడ్డి అధికారులకు సూచించారు.
వాగుపై ఏడు చెక్‌డ్యామ్‌లకు ప్రతిపాదనలు
గంగకత్వ ఆధునీకరణకు అదనంగా వాగుపై ఏడు చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని జగ్గారెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి ప్రాంతం నుంచి గంగకత్వకు వచ్చే వాగును అభివృద్ధి చేస్తే నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాగు, ప్రాజెక్టులో పూడిక తొలగింపునకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టులో ఆరు నుంచి ఏడు అడుగుల మేర పూడిక తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలపగా, సాంకేతికంగా ఎంతవరకు సాధ్యమో పరిశీలించాలని కోరారు.
కొల్కూరు–నిజాంపూర్‌ మధ్య మంజీరా బ్యాక్‌వాటర్‌తో పంటలు మునుగుతున్నాయని రైతులు తెలిపారు. అక్కడ చెక్‌డ్యామ్‌ నిర్మించాలని కోరగా, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
2028 నాటికి పనుల పూర్తికి ప్రణాళిక*
దీపావళి తర్వాత శంకుస్థాపన జరిగేలా చూస్తామని జగ్గారెడ్డి తెలిపారు. డిసెంబర్‌లోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 2028 నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. డిసెంబర్‌లో మరోసారి ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు.
నిధులు, పనుల మంజూరు కోసం కృషి చేయడమే తన బాధ్యతని, శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికారులు ప్రోటోకాల్‌ ప్రకారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి ఈ వాగుతో తనకు అనుబంధం ఉందని, తన భార్య స్వగ్రామం తాటిపల్లి కావడంతో తరచూ ఇక్కడికి వచ్చేవాడినని గుర్తుచేసుకున్నారు. పర్యటన సందర్భంగా గంగకత్వ కాలువలో జగ్గారెడ్డి ఈత కొట్టారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.