📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి*

*ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జి రాయల నాగేశ్వరరావు..*

*మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి అక్టోబర్ 28*

…వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు..ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్పోరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.

*వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు* సూచనల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు..అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.