📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం

📰 Generate e-Paper Clip

*రక్తదానం ప్రాణదానంతో సమానం*

*రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా*

* *మన ప్రజావాణి*, *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన ఎస్ఐ భూమేష్, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులను అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను కాపాడుతుందని, ఆరోగ్యవంతులు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ లింగంపల్లి భూమేష్, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

*జైపూర్ ఎస్టిపిపి పవర్ ప్లాంట్ లో ఆక్టోపస్ మాక్ డ్రిల్*

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్టిపిపి పవర్ ప్లాంట్ లో బుధవారం ఆక్టోపస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఆక్టోపస్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుధాలతో ఈ డ్రిల్ నిర్వహించారు. ఈసందర్భంగా సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ఉగ్రవాద సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలో అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ఉద్దేశమని తెలిపారు. ఈ డ్రిల్ తో భద్రతా ఏర్పాట్లలో లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్, ప్రాజెక్ట్ సిబ్బంది మధ్య సమన్వయం బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ లింగంపల్లి భూమేష్, స్థానిక పోలీసులు, ఆక్టోపస్ స్క్వాడ్, సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.