📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు

అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు

📰 Generate e-Paper Clip

*అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు*

*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్*

* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి*:-

అర్హులైన ప్రతి ఒక్కరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4, 5, 6, 7, 2, 27, 28, 26వ డివిజన్లలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మధుకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తోందని, ఆ పథకాల ప్రయోజనాలు అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఎంతో ముఖ్యమన్నారు. ఆధునిక సాంకేతికతతో డిజిటల్ కార్డులు పంపిణీ చేయడం వల్ల పారదర్శక సేవలు అందిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో నియోజకవర్గంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, కొండ్ర రాజేశ్వరి లింగయ్య, అమృత్ రాజ్ కుమార్, గుమ్మడి శ్రీనివాస్, తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేత రాజేష్, ఇరగదిండ్ల రవి, కాంగ్రెస్ ఇంచార్జ్ లు అంగిడి రాజేష్, బత్తుల స్వామి, మారు మల్లయ్య, కొత్త రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.