📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు ....కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు ….కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 19 (ప్రజా వాణి) : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరికీ రేవంతన్న టీం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజా పాలనలో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తమ వంతు నిరంతర కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన జమ్మి చెట్టును పూజించి, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఐక్యమత్యంతో ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయ స్పూర్తితో ప్రజలంతా కలిసికట్టుగా ముందడుగు వేయాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.