ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నేత జుక్కల్ గ్రామ సాయి నాథ్ నివాళులు
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 31
దేశ సమగ్రత, అభివృద్ధికి ఇద్దరు మహనీయుల సేవలు చిరస్మరణీయం
భారత తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరా గాంధీతో పాటు భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాయినాథ్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ తన పాలనలో దేశ సమగ్రత, ఆర్థిక అభివృద్ధి, పేదల సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని, దేశ అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, వందలాది సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అఖండ భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు. దేశ నిర్మాణంలో ఇద్దరు మహనీయులు అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని సాయినాథ్ పేర్కొన్నారు.

