📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వసూలు పై విచారణ జరిపించాలి

ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వసూలు పై విచారణ జరిపించాలి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు వసూలు పై విచారణ జరిపించాలి.

అమ్మగూడెం మాజీ సర్పంచ్ గండు జానయ్య.

ఇందిరమ్మ రాజ్యమా .. లేక మరి ఏమిటి..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారని వస్తున్న ఆరోపణల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అమ్మగూడెం మాజీ సర్పంచ్ గండు జానయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు… మండలం లోని అమ్మగూడెం కు మొదటి విడతలో ఇచ్చిన 11 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల లో తన ఆధ్వర్యంలో 8 మందిని తాను స్వయంగా ఎంపిక చేసినట్లు : తెలిపారు. మిగతా మూడు ఇతర నాయకులు ఇచ్చారని పేర్కొన్నారు. నేను ఎంపిక చేసిన లబ్దిదారుల నుంచి విచారణ చేయాలని కోరారు. తాను ఒక్క రూపాయి కూడ ఆశించలేదన్నారు. 40 ఏళ్ల గా కాంగ్రెస్ పార్టీకి నిస్వార్ధంగా పని చేస్తున్న తమ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో తన ఎదుగుదల ను చూసి ఓర్వలేక తన పై ఆసత్య ప్రచారం చేయటం బాధకరంగా ఉందన్నారు. ఇతర నాయకులు ఇచ్చిన ఇళ్ల పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాను అవినీతి కి పాల్పడినట్లు విచారణ లో తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చునని పేర్కోన్నారు. పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అదికూడా ప్రజా ప్రభుత్వంలో ఇలా వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.