📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaరైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు – పాలడుగు నాగార్జున డిమాండ్

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు – పాలడుగు నాగార్జున డిమాండ్

📰 Generate e-Paper Clip

ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి – బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు – పాలడుగు నాగార్జున డిమాండ్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ మండలం అన్నారెడ్డిగూడ గ్రామంలో నీరు లేక పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పాలడుగు నాగార్జున తెలిపారు. ఆదివారం గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, అన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన సైదిరెడ్డి అనే రైతు వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 100 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని తెలిపారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే, నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్నారెడ్డిగూడ గ్రామంతో పాటు నల్లగొండ మండలంలోని ఇతర గ్రామాల్లో సమగ్ర పంట నష్టం సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు. రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు జరగకుండా సాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా అనురాధ, కొండా వెంకన్న, పోలీస్ సత్యనారాయణ, బతుల బక్కయ్య, బతుల వెంకులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.