📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSiddipetరాష్ట్రస్థాయి ఐటీఏ-2026 అవార్డుకు ఎంపికైన నాంచారుపల్లి ఉపాధ్యాయిని

రాష్ట్రస్థాయి ఐటీఏ-2026 అవార్డుకు ఎంపికైన నాంచారుపల్లి ఉపాధ్యాయిని

📰 Generate e-Paper Clip

 

సిద్ధిపేట, సెప్టెంబర్ 23:విద్యార్థులకు వినూత్న బోధనా పద్ధతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్.స్రవంతి రాష్ట్ర స్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు (ఐటీఏ-2026)కు ఎంపికయ్యారు. జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు నూతన బోధనా విధానాలతో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఐటీఏ-2026కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 50 మందిని ఎంపిక చేసి అవార్డులతో సత్కరించారు.

 

ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శ్రీమతి ఎస్. స్రవంతికి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డును అందజేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా వినూత్న బోధనా పద్ధతులను అమలు చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. అవార్డు అందుకున్న సందర్భంగా ఎస్. స్రవంతి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగానూ, గర్వంగానూ ఉందన్నారు. ఈ అవార్డు తనలో మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యసనకు ఉపయోగపడే వినూత్న బోధనా పద్ధతులను అనుసరిస్తూ, వారి విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

ఐటీఏ-2026 అవార్డుకు తనను ఎంపిక చేసి సత్కరించిన జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రతినిధులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తిలో మరింత అంకిత భావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

వెల్లువఅభినందనల

రాష్ట్రస్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు ఎంపికైన శ్రీమతి ఎస్. స్రవంతిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు అభినందించారు. గ్రామీణ ప్రాంత పాఠశాలలో పనిచేస్తూ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగు పరుస్తున్న స్రవంతికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం కొత్త ఆలోచనలు, వినూత్న బోధనా పద్ధతులతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇటువంటి అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.