📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSiddipet'నేను కలలు కన్న భారత్’పై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు సెప్టెంబర్ 25, 26...

‘నేను కలలు కన్న భారత్’పై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సిద్దిపేట జిల్లాలో నిర్వహణ విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకతకు వేదికగా ‘సేవా సంకల్ప అభియాన్’

📰 Generate e-Paper Clip

సిద్ధిపేట, సెప్టెంబర్ 23:సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో ‘నేను కలలు కన్న భారత్’ అనే అంశంపై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించనున్నట్లు బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ ఖమ్మం వేంకటేశం, కార్యదర్శి వాసరి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నిర్దేశించిన పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయిదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖన పోటీ నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల ద్వారా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతల వివరాలతో కూడిన డ్రాయింగ్ షీట్లను సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించి, ఎంపికైన చిత్రాలను రాష్ట్ర పార్టీకి పంపనున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో చిత్రలేఖన పోటీల విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1,00,000ల నగదు,, ద్వితీయ బహుమతిగా రూ.50,000ల నగదు,, తృతీయ బహుమతిగా ఇద్దరికి రూ.25,000ల నగదు, చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. అయిదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాలు – పాలన – 2047 వికసిత భారత్” అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సి ఉంటుందన్నారు.2047 నాటికి భారత్ ఎలా ఉండాలి, దేశ అభివృద్ధిపై విద్యార్థుల ఆలోచనలు, ఆశయాలు, భవిష్యత్ దృష్టికోణం వంటి అంశాలను ఉపన్యాసంలో ప్రస్తావించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి, వారి వివరాలను జిల్లా పార్టీకి పంపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేసిన అనంతరం రాష్ట్రస్థాయి ఉపన్యాస పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఉపన్యాస పోటీల రాష్ట్రస్థాయి విజేతలకు కూడా ప్రథమ బహుమతిగా రూ.1,00,000ల నగదు, ద్వితీయ బహుమతిగా రూ.50,000ల నగదు, తృతీయ బహుమతిగా ఇద్దరికి రూ.25,000ల నగదు, చొప్పున అందిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జిల్లాలోని నిర్దేశించిన పాఠశాలల్లో పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, పట్టణ స్థాయి బాధ్యులు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ జిల్లా నాయకత్వం కోరింది. విద్యార్థులకు పోటీ అంశాలను ముందుగానే తెలియజేసి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని సూచించింది. విద్యార్థుల్లో దేశాభివృద్ధిపై ఆలోచనా విధానం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని తెలిపారు. పార్టీ జిల్లా, మండల, పట్టణ స్థాయి బాధ్యులు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.