రాష్ట్రస్థాయి ఐటీఏ-2026 అవార్డుకు ఎంపికైన నాంచారుపల్లి ఉపాధ్యాయిని
సిద్ధిపేట, సెప్టెంబర్ 23:విద్యార్థులకు వినూత్న బోధనా పద్ధతుల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా సిద్ధిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్.స్రవంతి రాష్ట్ర స్థాయి ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు (ఐటీఏ-2026)కు ఎంపికయ్యారు. జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు నూతన బోధనా విధానాలతో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఐటీఏ-2026కు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు...