‘నేను కలలు కన్న భారత్’పై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సిద్దిపేట జిల్లాలో నిర్వహణ విద్యార్థుల ఆలోచనలు, సృజనాత్మకతకు వేదికగా ‘సేవా సంకల్ప అభియాన్’

సిద్ధిపేట, సెప్టెంబర్ 23:సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని పలు పాఠశాలల్లో ‘నేను కలలు కన్న భారత్’ అనే అంశంపై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించనున్నట్లు బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ ఖమ్మం వేంకటేశం, కార్యదర్శి వాసరి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నిర్దేశించిన పాఠశాలల్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయిదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి...