📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనేపాల్‌ భూకంప బాధితులకు అండగా టీవీజీ సేన...ప్రజాసేవలో టీవీజీ సేన సేవలు అభినందనీయం: హైకోర్టు న్యాయవాది...

నేపాల్‌ భూకంప బాధితులకు అండగా టీవీజీ సేన…ప్రజాసేవలో టీవీజీ సేన సేవలు అభినందనీయం: హైకోర్టు న్యాయవాది గిరిబాబు

📰 Generate e-Paper Clip

సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): టీవీజీ సేన ఆధ్వర్యంలో తుల్లా వీరేందర్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో దేవేంద్ర ఫౌండేషన్‌ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం సమయంలో బాధితులకు భోజనం, వసతి కల్పించి మానవతా దృక్పథంతో సేవలందించిన టీవీజీ సేన బృందాన్ని హైకోర్టు న్యాయవాది కోండ్రోన్‌పల్లి గిరిబాబు అభినందించారు.

ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ప్రశంసనీయమని గిరిబాబు అన్నారు. ప్రజాసేవ పట్ల టీవీజీ సేన చూపుతున్న చొరవను కొనియాడారు. భవిష్యత్తులో కూడా టీవీజీ సేన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు, సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం తుల్లా వీరేందర్‌గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో టీవీజీ సేన సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.