prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 7:35 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

నేపాల్‌ భూకంప బాధితులకు అండగా టీవీజీ సేన…ప్రజాసేవలో టీవీజీ సేన సేవలు అభినందనీయం: హైకోర్టు న్యాయవాది గిరిబాబు

సెప్టెంబర్‌ 13 (ప్రజావాణి): టీవీజీ సేన ఆధ్వర్యంలో తుల్లా వీరేందర్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో దేవేంద్ర ఫౌండేషన్‌ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ముఖ్యంగా 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపం సమయంలో బాధితులకు భోజనం, వసతి కల్పించి మానవతా దృక్పథంతో సేవలందించిన టీవీజీ సేన బృందాన్ని హైకోర్టు న్యాయవాది కోండ్రోన్‌పల్లి గిరిబాబు అభినందించారు.

ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం ప్రశంసనీయమని గిరిబాబు అన్నారు. ప్రజాసేవ పట్ల టీవీజీ సేన చూపుతున్న చొరవను కొనియాడారు. భవిష్యత్తులో కూడా టీవీజీ సేన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు, సమాజానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం తుల్లా వీరేందర్‌గౌడ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో టీవీజీ సేన సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.